2006లోనే దీపికా పదుకొనే టాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యిందట..!!!
పైన display అయినా కింగ్ ఫిషర్ క్యాలెండరు ఫోటోలు 2006 నాటివి అవి చూసి టాలీవుడ్ లో ఓ హీరో వ్యంగంగా మాట్లాడాడు “ఏ దీపికా పడుకునే కానీ నిలపడదా?”అన్నాడట! మరి ఇప్పుడో…..
ఇక్కడ రిజెక్ట్ అయిన దీపిక పదుకొనే ప్రస్తుతం బాలీవుడ్ హైయెస్ట్ రెమ్యూరేషన్ తీసుకుంటున్న హీరోయిన్. టాలీవుడ్ లో డెబ్యూ మూవీ అని యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో నటిస్తున్న ఫస్ట్ మూవీ అని చెప్పుకుటున్నారు ఈ సినిమాకు మహానటి ఫేం నాగ్ అశ్విన్ డైరెక్టర్. తెలుగు నాట ప్రతిష్టాత్మక బ్యానర్ వైజయంతి సంస్థ ఈ సినిమా తీస్తోంది. ఈ సినిమా పూర్తిగా సైన్స్ ఫిక్షన్ తో ఉంటుందని అంటున్నారు. ఈ మూవీ ద్వారా దీపిక తెలుగులో ఎంట్రీ ఇస్తోందని వస్తున్న సమాచారం తప్పు అని అంటున్నారు. దీపిక ఇంతకు ముందే తెలుగులో ఒక సినిమాలో నటించింది. దర్శకుడు జయంత్ సి పరాన్జీ బాలకృష్ణ , కత్రినా కైఫ్ లతో అల్లరి పిడుగు చిత్రం చేస్తున్న సమయంలోనే జయంత్ దృష్టిలో దీపికా పడింది. కత్రినా కైఫ్, దీపికా ఇద్దరు కూడా ముంబై లోని మ్యాట్రిక్స్ అనే సంస్థలో అగ్గ్రిమెంట్ చేసుకున్న క్లయింట్స్ . అల్లరి పిడుగు షూటింగ్ జరుగుతున్నపుడు కత్రినా కైఫ్ సెక్రటరీ పియా అనే అమ్మాయి, కింగ్ ఫిషర్ క్యాలెండరు కి ఫోటో షూట్ చేసిన దీపికా పోర్టుఫోలియో చూపించింది. అప్పుడే జయంత్ తన నెక్స్ట్ మూవీ లవ్ ఫర్ ఎవర్ అనే సినిమాలో బుక్ చేసుకున్నాడు.
అయితే ఆ మూవీ కొంత పార్ట్ షూటింగ్ జరుపుకున్న తరువాత ఆగిపోయింది . దాంతో దీపికను వెండి తెర మీద జనం అలా చూడలేకపోయారన్నమాట. అంతే కాకుండా అప్పట్లో దీపికా కింగ్ ఫిషర్ క్యాలెండరు ఫోటోలు పట్టుకుని ఆర్టిస్ట్ మేనేజర్ రాంబాబు వర్మ టెన్నిస్ స్టార్ ప్రకాష్ పదుకొనే కూతురు దీపికా పదుకొనే అని టాలీవుడ్ హీరోలకు, ప్రముఖులకు చూపించడం జరిగింది కానీ… తేజ అనే హీరో ఏ దీపికా పడుకునే కానీ నిలపడదా? అంటూ వ్యంగంగా మాట్లాడారట. ఆ తర్వాత బాలీవుడ్ లో ఓం శాంతి ఓం చిత్రం బ్లాక్ బస్టర్ కావడం ఇక దీపిక టాప్ రేంజి స్టార్ అయిపోవడం జరిగింది. దాంతో ఆమె పారితోషికం కూడా చాలా భారీగా ఉంది. ఇక పాన్ ఇండియా మూవీ కాబట్టి ప్రభాస్ పక్కన ఆమెను తీసుకున్నారు. ఈ మూవీకి గానూ దీపిక అందుకునే మొత్తం అక్షరాలా 30 కోట్ల రూపాయలు అంటున్నారు. నిజంగా కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ ఇది.మొత్తానికి దీపిక ఇన్నాళ్ళకు తెలుగు నాట కనిపించనుందన్నమాట. అది కూడా అద్భుతమైన బ్యానర్, టాప్ లెవెల్ హీరో, టాలెంటెడ్ డైరెక్టర్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ..













