Deepika Padukone: తిరిగి షూటింగులకు రెడీ అవుతున్న దీపికా పదుకొణె
గతేడాది ఆడపిల్లకు జన్మనిచ్చిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె(Deepika Padkone) కూతురి కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చి మదర్‌హుడ్ ను ఎంజాయ్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ దీపికా షూటింగ్స్ లో పాల్గొనడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో బిడ్డ పుట్టాక తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి, మళ్లీ షూటింగ్ లో పాల్గొనడంపై దీపిక మాట్లాడింది.
జీవితంలో తల్లి అవడం ఎంతో గొప్ప అనుభూతి అని, ప్రస్తుతం తాను ఆ అనుభూతిని ఎంజాయ్ చేస్తున్నట్టు దీపికతెలిపింది. కూతురు పుట్టినప్పటి నుంచి సినిమాలకు బ్రేక్ ఇచ్చిన తాను ఇప్పుడు మళ్లీ మేకప్ వేసుకుని కెమెరా ముందుకు రావడానికి రెడీ అవాలని, తల్లిగా తన బాధ్యతలు అన్నింటినీ నిర్వర్తిస్తూనే మిగిలినవన్నీ చేసుకోవాలని దీపికా(Deepika) తెలిపింది.
ఇలాంటి విషయాల్లో సలహాలు, సూచనలు ఇవ్వడానికి చాలా మంది ఉంటారని, ఎవరెన్ని చెప్పినా కూతురిని ఇంట్లో వదిలి మన పనిలో మనం బిజీ అవడం చాలా సవాలుగా ఉంటుందని, దీన్ని ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తున్నానని, ఎలాగైనా దీన్ని ఎదుర్కొంటాననే నమ్మకంత తనకుందని దీపికా చెప్తోంది. అయితే ఈ ఎఫెక్ట్ సినిమాలపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటానని ఆమె పేర్కొంది.













