Deepika Padukone: భారీ ప్రాజెక్టులతో బిజీ బిజీ

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొణె(Deepika Padukone) వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రానున్న స్పిరిట్(Spirit) సినిమాలో అవకాశం చేజారినా అమ్మడు పలు క్రేజీ ప్రాజెక్టులతో కెరీర్లో ముందుకు దూసుకెళ్తుంది. ప్రస్తుతం దీపికా చేతిలో రెండు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలున్నాయి.
అందులో మొదటిది కింగ్(King). షారుఖ్ ఖాన్(Shah rukh Khan) హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైంది. 2026లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా పఠాన్(pathaan), జవాన్(jawaan) తర్వాత షారుఖ్, దీపికా కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దానికి తోడు కింగ్ మూవీ బాలీవుడ్ లో మోస్ట్ అవెయిటెడ్ సినిమాల్లో ఒకటిగా తెరకెక్కుతుంది.
షారుఖ్ తో కింగ్ సినిమా చేస్తూనే దీపికా అల్లు అర్జున్(Allu Arjun), అట్లీ(Atlee) కాంబినేషన్ లో వస్తోన్న పాన్ ఇండియా సినిమాలోనూ స్థానం దక్కించుకుంది. ఇండియన్ సినిమాలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో అల్లుఅర్జున్ అట్లీ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో అల్లు అర్జున్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడని, దీపికా యోధురాలి లుక్ లో కనిపించనుందని, ఈ క్యారెక్టర్ కోసం దీపికా పదుకొణె స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటుందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి దీపిక పాన్ ఇండియన్ స్టార్ల సరసన నటిస్తూ చాలా బిజీగా ఉంది.