వాయిదా పడిన విశ్వక్ సినిమా..
సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా నిలదొక్కుకోవడం కష్టమే అని అందరికి తెలిసిన విషయమే. టాలెంట్ తో పాటు కాస్త లక్ కూడా ఉండాలని చెప్పొచ్చు. ఇలా తన ఓన్ టాలెంట్ తో ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ప్రేక్షకుల ముందుకి వచ్చిన హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు. కెరీర్ స్టార్టింగ్ లో స్క్రిప్ట్ రైటర్ గా, డైరెక్టర్ గా ఉన్న విశ్వక్ తన టాలెంట్ తో తక్కువ టైం లోనే హీరోగా తెలుగు తెరకి పరిచయం అయ్యాడు. ” వెళ్ళిపోమాకే ” అనే సినిమాతో తెరంగ్రేటం చేసిన ఈ హీరో “ఈ నగరానికి ఏమైంది, పాగల్, ఫలక్ నామదాస్” వంటి చిత్రాలతో పాపులర్ అయ్యాడు.
మాస్ కా దాస్ అంటూ యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు విశ్వక్ సేన్. తన లాస్ట్ మూవీ “అశోక వనంలో అర్జున కళ్యాణం” సినిమా తర్వాత మరే సినిమాని ఓకే చేయలేదు. తాజాగా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా “దాస్ కా ధమ్కీ”. ఒకవైపు హీరోగా, మరో వైపు ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ గా ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు ఈ మాస్ హీరో. రెగ్యులర్ గా షూటింగ్ జరుపుకుంటూ విడుదలకి సిద్ధమవుతుంది ఈ సినిమా. అనుకున్న ప్రకారం ఫిబ్రవరి 17 న థియేటర్లలో రిలీజై ప్రేక్షకుల ముందుకి రావాల్సింది.
రిలీజ్ కి ఇంకా రెండు వారాలు కూడా టైం లేదు. కానీ, అనుకున్న సమయానికి ఈ సినిమాని రిలీజ్ చేయలేకపోతున్నట్లు సమాచారం అందుతుంది. విశ్వక్ దాస్ కా ధమ్కీ సినిమా విషయంలో ఎక్కడా రాజి పడకపోవడం దీనికి కారణమని తెలుస్తుంది. మంచి అవుట్ ఫుట్ కోసం కాంప్రమైజ్ అవ్వకుండా ఎక్కువ సమయం తీసుకుని పని చేస్తున్నాడట. అందుకే సినిమా విడుదల వాయిదా పడిందని ఇండస్ట్రీలో టాక్. ఇప్పటికే రిలీజైన ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల అనే సాంగ్ జనాల మనసులలోకి ఎక్కేసింది. ఈ ఒక్క పాటతో ఈ సినిమా మీద భారీ అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమా న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ రాలేదు.













