దర్పణం సెన్సార్ పూర్తి
తనిష్క్‌రెడ్డి, ఎలక్సియస్ జంటగా రామకృష్ణ వెంప దర్శకత్వంలో శ్రీనంద ఆర్ట్స్ పతాకంపై క్రాంతి కిరణ్ వెల్లంకి నిర్మిస్తున్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ దర్పణం. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్‌కి విశేష స్పందన లభించగా.. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 6న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రామకృష్ణ వెంప మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో థ్రిల్లర్ జోనర్లో వచ్చిన అన్ని సినిమాలు విజయం సాధించాయి. అదే తరహాలో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో రాబోతున్న చిత్రం దర్పణం. లాస్ట్ మినిట్ వరకు ఏం జరుగుతుందా? అని సస్పెన్స్‌ని క్రియేట్ చేస్తూ ఆద్యంతం అలరిస్తుంది. ప్రొడ్యూసర్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని నిర్మించారు ఆయన సహకారం మర్చిపోలేనిది అన్నారు.













