Prabhas: ఫ్రాంచైజ్ సినిమాలతో బిజీబిజీగా డార్లింగ్
బాహుబలి(baahubali), బాహుబలి2(baahubali2) తర్వాత ప్రభాస్(prabhas) మార్కెట్, క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో విపరీతంగా పెరిగాయి. అప్పటివరకు యంగ్ రెబల్ స్టార్ అయిన ప్రభాస్ ను బాహుబలి ఫ్రాంచైజ్ పాన్ ఇండియా స్టార్ గా మార్చాయి. బాహుబలి కోసం ఎంతో కాలాన్ని ఖర్చు చేసిన ప్రభాస్, ఇకపై వేగంగా సినిమాలు చేసి సంవత్సరానికి కనీసం ఓ సినిమా చేస్తానని ఫ్యాన్స్ కు మాటిచ్చిన సంగతి తెలిసిందే.
ఇచ్చిన మాట ప్రకారమే ప్రభాస్ వరుస సినిమాలను లైన్ లో పెట్టి వాటిని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. అందులో భాగంగానే ఒకేసారి రెండు సినిమాల షూటింగ్ లో కూడా పాల్గొంటూ మునుపెన్నడూ లేనంత బిజీగా ఉంటున్న ప్రభాస్ లైనప్ పలు సినిమాలతో, సీక్వెల్స్ తో చాలా స్ట్రాంగ్ గా ఉంది. ప్రస్తుతం రాజా సాబ్(raja saab), ఫౌజీ(Fauji) సినిమాలను చేస్తున్న డార్లింగ్ ఆ రెండు సినిమాలకూ పార్ట్2 చేయాల్సి ఉంది.
ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా(sandeep reddy vanga)తో చేయనున్న స్పిరిట్(spirit) మూవీ కూడా రెండు భాగాలుగానే రానుండగా, ఆల్రెడీ రిలీజైన కల్కి(kalki)కి సీక్వెల్ గా కల్కి2(kalki2)తో పాటూ సలార్(salaar) కు సీక్వెల్ గా సలార్2(salaar2) కూడా ప్రభాస్ లైనప్ లో ఉన్నాయి. వీటితో పాటూ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్(prem rakshit) దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మించడానికి కూడా ప్రభాస్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి సీక్వెల్ సినిమాలతో డార్లింగ్ చాలా బిజీగా ఉన్నాడు. వీటితో పాటూ మరికొన్ని కొత్త సినిమాలను కూడా ఒప్పుకోవడానికి డార్లింగ్ కథలు వింటున్నాడని తెలుస్తోంది.













