Dacoit: డెకాయిట్ అప్డేట్ ఇచ్చిన శేష్

అడివి శేష్(Adivi Sesh) హీరోగా సినిమా వచ్చి రెండేళ్లు దాటింది. ప్రస్తుతం శేష్ గూఢచారి2(Goodachari2) మరియు డెకాయిట్(Dacoit) సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలుండగా అందులో డెకాయిట్ సినిమా ముందు రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానియల్ డియో(Shaniel Deo) దర్శకత్వంలో ఈ డెకాయిట్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది.
డెకాయిట్ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజవాల్సింది కానీ ఈ సినిమాలో ముందు హీరోయిన్ గా అనుకున్న శృతి హాసన్(Shruthi Hassan) కొంత భాగం షూటింగ్ జరిగాక తప్పుకోవడంతో ఆమె ప్లేస్ లోకి మృణాల్(Mrunal Thakur) ను తీసుకుని మళ్లీ ఆ షూటింగ్ ను చేయాల్సి రావడంతో సినిమా లేటైంది.
భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి తాజాగా హీరో అడివి శేష్ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. డెకాయిట్ సినిమాకు డబ్బింగ్ టెస్ట్ జరిగిందని, ఎల్లుండి నుంచి మళ్లీ తిరిగి షూటింగ్ లో జాయిన్ అవాలని చెప్తూ డబ్బింగ్ స్టూడియో నుంచి ఓ ఫోటోను షేర్ చేయగా ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios) సమర్పణలో సుప్రియా యార్లగడ్డ(Supriya Yarlagadda) నిర్మిస్తుండగా సునీల్ నారంగ్(Suneel Narang) ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.