coolie: కూలీ తెలుగు ఈవెంట్ అప్పుడేనా?

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్(rajinikanth), లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కూలీ(Coolie). వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఆడియన్స్ కు కూలీపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది. ఈ సినిమాలో ఉపేంద్ర(Upendra), ఆమిర్ ఖాన్(aamir khan), నాగార్జున(nagarjuna) కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
శృతి హాసన్(sruthi hassan) హీరోయిన్ గా నటిస్తుండగా పూజా హెగ్డే(Pooja Hegde) ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేస్తోంది. ఇంతటి భారీ తారాగణంతో తెరకెక్కిన కూలీ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆడియన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకు కేవలం తమిళంలోనే కాకుండా అన్ని భాషల్లోనూ మంచి క్రేజ్ ఉంది. కాగా ఈ మూవీ తెలుగు వెర్షన్ కు సంబంధించి ఓ లేటెస్ట్ న్యూస్ తెలుస్తోంది.
కూలీ సినిమాకు సంబంధించిన తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఆగస్ట్ 7న ఈ కూలీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్(coolie pre release event) జరగనుందని తెలుస్తోంది. ఈ ఈవెంట్ కు రజినీకాంత్ తో సహా నాగార్జున, ఉపేంద్ర కూడా హాజరవుతారని సమాచారం. కూలీ బాలీవుడ్ ప్రమోషన్స్ కు ఆమిర్ ఖాన్ హాజరయ్యే అవకాశముంది. ఆగస్ట్ 14న కూలీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.