Coolie: కూలీ నుంచి సూపర్ అప్డేట్

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth) హీరోగా నటిస్తున్న సినిమా కూలీ(Coolie). లోకేష్ కనగరాజ్(lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. ప్రస్తుతం కూలీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఉపేంద్ర(Upendra), నాగార్జున(Nagarjuna) కీలక పాత్రల్లో నటిస్తుండగా, కూలీ సినిమా ఆగస్ట్ 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన కంటెంట్ సినిమాపై బజ్ ను విపరీతంగా పెంచేయగా, ఇప్పుడు కూలీ నుంచి ఆడియన్స్ కు మరో ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది. కూలీలోని చికిటు(Chikitu) అనే సాంగ్ కు సంబంధించిన మ్యూజికల్ వీడియోను జూన్ 25 సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఈ విషయాన్ని వెల్లడిస్తూ మేకర్స్ దానికి సంబంధించిన ఓ అనౌన్స్‌మెంట్ వీడియోను కూడా నెట్టంట పోస్ట్ చేశారు. అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని సాంగ్స్ ఎలా ఉంటాయా అని ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. శృతి హాసన్(Shruthi Hassan) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే(poja hegde) ఐటెం సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
https://x.com/sunpictures/status/1937125990712725630