Ritesh Deshmukh: మస్తీ4 ట్రైలర్ పై భిన్నాభిప్రాయాలు
బాలీవుడ్ స్టార్ హీరో రితేష్ దేశ్ముఖ్(Ritesh Deshmukh) ప్రస్తుతం ఓ ప్రతిష్టాత్మక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అదే రాజా శివాజీ(Raja Shivaji). ఛతప్రతి శివాజీ(Chatrapati shivaji) జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతునన ఈ సినిమాను రితేష్ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్నారు. ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలుండగా, రితేష్ కూడా రాజా శివాజీ తన కెరీర్లోనే మైల్ స్టోన్ ఫిల్మ్ గా నిలుస్తుందని భావిస్తున్నాడు.
ఇదిలా ఉంటే రాజా శివాజీకి ముందు రితేష్ మస్తీ4(Mastiii4) చేస్తున్న సంగతి తెలిసిందే. మస్తీ4 అడల్ట్ కామెడీ సినిమాగా తెరకెక్కుతుండగా, రాజా శివాజీకి ముందు రితేష్ ఇలాంటి క్యారెక్టర్ ను చేయడం చూసి అందరూ డిజప్పాయింట్ అవుతూ, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రాజా శివాజీ లాంటి సినిమాను చేసే మస్తీ4 లాంటి సినిమాను చేయడం అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు.
రీసెంట్ గా మస్తీ4 ట్రైలర్(Mastiii4 trailer) రిలీజవగా, దాన్ని చూసిన ఆడియన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మస్తీ4 ట్రైలర్ విలువల్లేకుండా, సెక్సువల్ రిఫరెన్సులపై ఆధారపడి ఉందని, ఇంకా మేకర్స్ 2000 సంవత్సరంలోనే ఉన్నారని ఆడియన్స్ విమర్శిస్తున్నారు. మస్తీ4 ట్రైలర్ లో రితేష్ దేశ్ముఖ్ తన యాక్టింగ్, కామెడీతో మెప్పించినప్పటికీ రాజా శివాజీకు ముందు ఇలాంటి క్యారెక్టర్ లో కనిపించడానికి రితేష్ ఎలా ఒప్పుకున్నాడని అందరూ విమర్శిస్తున్నారు.







