మిస్టర్ బచ్చన్‌కు పోటీ తప్పేలా లేదుగా
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. బాలీవుడ్ హిట్ సినిమా రైడ్ కు ఇది అధికారిక రీమేక్ అయినప్పటికీ హరీష్ శంకర్ మూల కథను మాత్రమే తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఎన్నో మార్పులు చేశాడు.
మొన్నా మధ్య రిలీజ్ చేసిన టీజర్ లో ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. టీజర్ తో అంచనాలు పెరిగి మిస్టర్ బచ్చన్ కు మంచి బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయట. దానికి తోడు హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్ట్ 15న రిలీజ్ చేయాలని మేకర్స్ చూస్తున్నారట.
అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ అదే డేట్ ను లాక్ చేశారంటున్నారు. ఇప్పటికే ఆ డేట్ లో రామ్ డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కానుంది. మరో రెండు చిన్న సినిమాలు కూడా రిలీజ్ కానున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశాయి. రవితేజ రావడం కన్ఫర్మ్ అయితే వాటిలో ఏదో ఒక సినిమా వాయిదా పడే ఛాన్సుంది. కానీ డబుల్ ఇస్మార్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాయిదా పడే సమస్యే లేదని తెలుస్తోంది. అలా కాకుండా మిస్టర్ బచ్చన్ తర్వాత వద్దామనుకుంటే ఆగస్ట్ మూడో వారంలో రావాలి. లేదంటే లాస్ట్ వీక్ లో నాని సరిపోదా శనివారం రానుంది. కాబట్టి ఎటు చూసినా రవితేజకు పోటీ తప్పేట్లు కనిపించడం లేదు.













