Akhanda2: అఖండ2 కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
నందమూరి బాలకృష్ణ(Balakrishna) నటించిన తాజా సినిమా అఖండ2 తాండవం(Akhanda2 thandavam). బోయపాటి(Boyapati srinu) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అఖండ(Akhanda) మూవీకి సీక్వెల్ గా వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్, ట్రైలర్ రిలీజవగా వాటికి ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. డిసెంబర్ 5న అఖండ2 తాండవం పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ కానుంది.
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసి, ఇప్పటికే పలు ప్రాంతాల్లో పలు ఈవెంట్స్ ను నిర్వహించి సినిమాపై హైప్ ను పెంచే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రమోషన్స్ లో భాగంగానే చిత్ర యూనిట్ నవంబర్ 28న ప్రీ రిలీజ్ ఈవెంట్(Akhanda2 Pre release event) ను హైదరాబాద్ లో చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth reddy) రావడం ఆల్మోస్ట్ ఫిక్సైందని అంటున్నారు.
రేవంత్ రెడ్డితో పాటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ను కూడా అఖండ2 ఈవెంట్ కోసం తీసుకొద్దామనుకున్నారు కానీ బన్నీ(Bunny) షూటింగులతో బిజీగా ఉండటం వల్ల కుదరడం లేదని, అన్నీ అనుకున్నట్టు జరిగితే బన్నీని అఖండ2 సక్సెస్ మీట్ కు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. సంయుక్త మీనన్(Samyuktha menon) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి(Adhi pinisetty) విలన్ గా నటిస్తుండగా, తమన్(Thaman) ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.






