ఈగల్ చివరి 30 నిమిషాలు పూనకాలేనట!
మాస్ మహారాజా రవితేజ నుంచి సినిమా రిలీజవుతుందంటే అదొక పండగలా ఉంటుంది. కానీ ఈగల్ సినిమా విషయంలో మాత్రం ఆ బజ్ కనిపించడం లేదని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. సినిమాలోని కంటెంట్ మీదున్న నమ్మకంతో మేకర్స్ ఈ సినిమాకు ఎక్కువగా ప్రమోషన్స్ చేయడం లేదు. అందుకే ఈగల్ ప్రమోషన్స్ విషయంలో ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు.
ఇంటర్వ్యూల్లో కూడా చిత్ర బృందం సినిమా గురించి ఓవర్ గా ఎలివేషన్స్ ఇవ్వడం లేదు. రిలీజ్ రోజు మొదటి షో అయ్యాక మౌత్ టాక్ తో ఒక్కసారిగా బుకింగ్స్ పెరుగుతాయన్న నమ్మకంతో టీమ్ ఉంది. సినిమాలోని ట్విస్ట్ లు రివీల్ కాకుండా ఉండటానికి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సినిమాను యాక్షన్ మూవీ అనుకుంటున్నారు చాలా మంది.
కానీ ఈగల్ కమర్షియల్ ఫార్మాట్లో పత్తి రైతుల సమస్య బ్యాక్ డ్రాప్ లో ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని తెలుస్తోంది. సినిమాలో చివరి అరగంట ఎలివేషన్లతో ఆడియన్స్ షాక్ అవడం ఖాయమంటున్నారు. ధమాకా తర్వాత సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ఈ సినిమా విజయం ఎంతో కీలకం కానుంది.













