Mokshagna: మోక్షు గురించి ఇకనైనా క్లారిటీ ఇస్తే బెటర్!
అన్నీ రెడీ చేసుకునిమొన్న డిసెంబర్ లో పూజా కార్యక్రమాలతో మొదలవుతుందనుకున్న మోక్షజ్ఞ(Mokshagna) డెబ్యూ మూవీకి బ్రేక్ పడటం అందరినీ షాక్ కు గురి చేసింది. ముహూర్తం, హీరోకి స్వల్ప అస్వస్థత వల్ల వాయిదా వేయలేక తప్పలేదని బాలయ్య(Balayya) చెప్పాడు కానీ బ్యాక్ గ్రౌండ్ లో అసలేం జరిగిందనే దానిపై మాత్రం ఎన్నో రకాల ప్రచారాలు వినిపించాయి.
స్క్రిప్ట్ తో సహా ప్రశాంత్ వర్మ(Prasanth Varma) రెడీ చేసుకుని ఉండగా లాస్ట మినిట్ లో వాయిదా పడటం ఊహించని పరిణామం. ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో మంచి పవర్ఫుల్ సబ్జెక్టుని రెడీ చేసుకున్నాడనే టాక్ అంతకు ముందే వచ్చింది. దీంతో సంక్రాంతికి ఏదైనా అప్డేట్ వస్తుందేమోనని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు కానీ ప్రస్తుతానికి ఆ ఛాన్స్ లేదని టాక్.
జనవరి లాస్ట్ వీక్ లేదా ఫిబ్రవరిలో సెట్స్ మీదకు తీసుకెళ్లేలా ప్లానింగ్ ఉందంటున్నారు. అసలు మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ కాంబోలోనే డెబ్యూ ఉంటుందా లేదా డైరెక్టర్ ఏమైనా మారే ఛాన్స్ ఉందా అనే డౌట్స్ కూడా అందరిలో ఉన్నాయి. ఇంకోవైపు ఆదిత్య 369 సీక్వెల్ కు బాలయ్య రెడీ అవుతున్నాడు. మరోవైపు బాలయ్య ఆదిత్య 369(Aditya 369) సీక్వెల్ కు రెడీ అవుతున్నారు. వెంటనే కాకపోయినా ఫైనల్ వెర్షన్ రెడీ చేసుకుని క్యాస్టింగ్ పనులను త్వరలోనే షురూ చేస్తారని టాక్. ఏదేమైనా మోక్షు ఎంట్రీ ఇప్పటికే లేటైన నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ కన్ఫ్యూజన్ కు క్లారిటీ ఇస్తే బావుంటుంది.













