సినీ ప్రముఖుల చమక్కులు పుస్తకావిష్కరణ
ఆనాటి సినీ ప్రముఖులు, రచయితలు, నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు వారి మధ్య వివిధ సందర్భాల్లో జరిగిన సంభాషణలు సేకరించిన ఒక పుస్తకంగా తీసుకువచ్చారు. సహ దర్శకుడు కనగాల జయకుమార్. హైదరాబాద్లో సినీ ప్రముఖుల సమక్షంలో హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. తొలి ప్రతినిని వాసిరెడ్డి విద్యాసాగర్కి అందించారు. ఈ కార్యక్రమంలో దర్శకులు రేలంగి నరసింహారావు, రాం ప్రసాద్, శివ నాగేశ్వరరావు, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎండ్లూరి సుధాకర్ రావు, రిటైర్డ్ జడ్డి కరపాల సుధాకర్, రచయిత మరుధూరి రాజా, నటుడు హేమసుందర్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ ప్రభు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.













