Chiranjeevi: తమ్ముడు సినిమా సెట్స్ లో అన్నయ్య

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తాను కమిట్ అయిన సినిమాలన్నింటినీ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే వీరమల్లు(HHVM), ఓజీ(OG) సినిమాలను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagath Singh) ను పూర్తి చేయాలని ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమాకు హరీష్ శంకర్(Harish Sankar) దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
గబ్బర్ సింగ్(Gabbar singh) తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై అందరికీ మంచి అంచనాలున్నాయి. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తై రిలీజవాల్సింది కానీ పవన్ మధ్యలో పాలిటిక్స్ లో బిజీ అవడం వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు పవన్ అందుబాటులోకి రావడంతో ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లోకి తాజాగా పవన్ కళ్యాణ్ అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) విజిట్ చేశారు. ఈ మూమెంట్ అందరికీ సర్‌ప్రైజింగ్ గా ఉండగా, ఒకే ఫ్రేమ్ లో మెగా బ్రదర్స్ ను చూసిన ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ ఫోటోలో చిరూ, పవన్ తో పాటూ మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) నిర్మాత రవి శంకర్(Ravi Shankar) కూడా కనిపిస్తున్నారు. శ్రీలీల(Sree Leela) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు.