మోగాస్టార్ సర్ ప్రైజ్
మెగాస్టార్ చిరంజీవి సర్ప్రైజ్ ఇచ్చారు. రామ్‌చరణ్ తాజా చిత్రం సెట్లో ప్రత్యక్షమయ్యారు. కొద్దిసేపు గడిపారు. రామ్‌చరణ్ సినిమా షూటింగ్ యూరప్ యూనియన్‌లోని అజర్ బైజాన్ ప్రాంతంలో జరుగుతోంది. బోయపాటి శ్రీను దర్శకుడు. సైరా షూటింగ్ కోసం జార్జియా వెళుతున్న చిరంజీవి తొలుత అజర్ బైజాన్ చేరుకున్నారు. అక్కడ చరణ్ షూటింగ్లో కొద్దిసేపు ఆగారు. సందడి చేశారు. అదేరోజు రాత్రి రామ్‌చరణ్ కోడలు ఉపాసన, కుమార్తె సుష్మిత, అల్లుడుతో కలిసి డిన్నర్ చేశారు. అంతకుముందు చిరు కుటుంబం ఫొటోకి ఫోజిచ్చారు. ఈ పిక్‌ను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందరూ బ్లాక్ కలర్ డ్రెస్ ధరించారు. జార్జియ వెళ్లడానికి ముందుకు చరణ్ సినిమా లోకేషన్‌ను మెగాస్టార్ సందర్శించారు అని ఆ పోస్ట్‌లో పేర్కొంది.













