Chiranjeevi: తండ్రి బాధ మగధీర టైమ్ లో అర్థమైంది: చిరంజీవి
రీసెంట్ గా మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి చేసిన ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి తల్లి అంజనా దేవి(Anjana Devi), ఆయన సోదరీమణులతో పాటూ తమ్ముడు నాగబాబు(Naga Babu) కూడా పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో చిరూ తన తండ్రిని గుర్తు చేసుకున్నాడు.
చిన్నప్పటి నుంచి తన తండ్రి తమ అందరికీ చాలా స్వేచ్ఛ ఇచ్చారని, సినిమాల్లోకి వెళ్తా అన్నప్పుడు భయపడ్డారు తప్పించి ఎప్పుడూ వద్దని చెప్పలేదని, ఆ గౌరవంతోనే తాను కూడా ఎంతో జాగ్రత్తగా సినిమాలు చేశానని చెప్పిన చిరూ, తాను షూటింగ్స్ లో అలసిపోయి వచ్చినప్పుడు తన తండ్రి అమ్మలా చేరదీసేవాడని తెలిపాడు.
ఓ సారి తాను గూండా(Goonda) మూవీ షూటింగ్ కోసం ట్రైన్ సీక్వెన్స్ లో చేస్తున్నప్పుడు ఎందుకు ఇలాంటివి చేస్తున్నావని పెద్దగా అరిచి కోప్పడ్డారని, ఏం కాదని ఎంత నచ్చజెప్పినా ఆయన వినలేదని, రేపు నీకొక కొడుకు పుట్టి వాడు ఇలానే చేస్తే తన భయం అర్థమవుతుందనే వారని, మగధీర(Magadheera) టైమ్ లో చరణ్(Charan) కిందపడి యాక్సిడెంట్ అయినప్పుడు తన తండ్రి భయం అర్థమైందని చిరంజీవి(Chiru) తెలిపాడు.













