ఎలివేషన్ బీజీఎంపై చిరూ కామెంట్స్
భోళా శంకర్ సినిమాతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ అందుకున్న చిరంజీవి, ఇకపై ఇప్పట్లో రీమేక్స్ జోలికి పోకూడదని డిసైడ్ అయ్యాడు. అంతేకాదు ప్రస్తుత ట్రెండ్ కూడా చిరూకు అర్థమైనట్లుంది. ఎంత ట్రెండ్ అర్థమైనా సరే మాత్రం కష్టపడే విషయంలో రాజీపడేది లేదని చిరూ చెప్తున్నాడు. రీసెంట్ గా ఓ సీనియర్ జర్నలిస్ట్, పాత్రికేయుల జీవితాలపై రాసిన బుక్ ను మెగా స్టార్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జరిగిన డిస్కషన్ లో హీరోయిజం గురించి చిరూ మాట్లాడుతూ, ఇంత పెద్ద వయసులో ఒళ్లు హూనం చేసుకుని డ్యాన్సులు, ఫైట్స్ చేయకుండా ఊరికే నడుచుకుంటూ వెళ్లి, డైలాగులు చెప్తే మిగిలినదంతా మ్యూజిక్ డైరెక్టర్ బీజీఎంతో ఎలివేట్ చేస్తే సరిపోతుందని సెటైర్స్ వేశారు. ఈ మాటను చిరూ ఫలానా సినిమా అని ప్రస్తావించలేదు కానీ ఇలా అనగానే అందరికీ గుర్తొచ్చేది మాత్రం జైలర్ మూవీనే.
అలా అని చిరంజీవి, రజినీకాంత్‌ను తక్కువ చేయలేదు. ఆడియన్స్ ఇప్పుడు అలాంటి సినిమాలను ఆదరిస్తున్నారు కాబట్టి వాటిని ఫాలో అవడం గమినించినట్లు చెప్పారు. ఇదే ధోరణి ఎప్పటికీ ఉంటుందని కూడా ఆయన చెప్పలేదు. కానీ మెగాస్టార్ చిరూ గా తాను ఇలాంటి సినిమాలు చేస్తే ఆడియన్స్, ఫ్యాన్స్ ఏ మాత్రం ఒప్పుకోరని, కచ్ఛితంగా డ్యాన్సులు, ఫైట్స్ చేసి ఒళ్లు హూనం చేసుకోవాల్సిందేనని కూడా క్లారిటీ ఇచ్చారు. చిరూ మాటలను బట్టి చూస్తుంటే చిరూకి రియాలిటీ అర్థమైనట్లే అనిపిస్తుంది. మరి వశిష్ఠతో చిరూ చేయబోయే సినిమా ఆయనకు ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుందో చూడాలి.













