చిత్రలహరి యూనిట్ కు మెగాస్టార్ ప్రశంస
సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సివిఎం నిర్మించిన చిత్రం చిత్రలహరి. ఈ నెల 12న విడుదలై సూపర్‌హిట్ టాక్‌తో సక్సెస్‌పుల్‌గా రన్ అవుతోంది. చిత్రం యూనిట్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడారు. చిత్రలహరి ఈ చిత్రాన్ని సెటిల్డ్ మెసేజ్‌తో చాలా చక్కగా తెరకెక్కించారన్నారు. కిషోర్ తిరుమల తన ప్రతిభను నిరూపించుకున్నారన్నారు. ఇక తేజు కూడ నటుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నాడని అన్నారు. మెచ్యూర్డ్ పెర్ఫామెన్స్‌తో చాలా చక్కగా నటించాడని పేర్కొన్నారు. పరిణితి సాధించిన నటుడిగా నిరూపించుకున్నాడని, నటీనటులందరూ బాగా న్యాయం చేశారన్నారు. బంధాలు, అనుబంధాలు, గురించి తండ్రి కొడుకు మధ్య అనుబంధం గురించి చక్కగా చెప్పారన్నారు. ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా మనం అనుకున్న లక్ష్యం సాధించటానికి కృషితో ముందుకు వెళ్లాలని చెప్పిన చిత్రం చిత్రలహరి అన్నారు. ఈ వేసవికి విడుదలైన చిత్రలహరి ప్రతిఒక్కరూ చూడదగ్గ చిత్రమన్నారు.













