Thandel: నేనింత గొప్ప లవ్ స్టోరీ రాస్తానని ఎప్పుడూ అనుకోలేదు: చందూ మొండేటి
నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా సినిమా తండేల్(Thandel). కార్తికేయ2 తర్వాత చందూ నుంచి వస్తున్న సినిమా అవడం, ప్రేమమ్(Premam), సవ్యసాచి(Savyasachi) సినిమాల తర్వాత చందూ- చైతూ కాంబోలో వస్తున్న సినిమా కావడం అన్నింటికంటే లవ్ స్టోరీ(Love Story) సినిమా తర్వాత సాయి పల్లవి, నాగచైతన్య కలిసి నటిస్తున్న సినిమా కావడంతో తండేల్ పై అందరికీ మంచి అంచనాలున్నాయి.
ఫిబ్రవరి 7న రిలీజ్ కానున్న తండేల్ గురించి డైరెక్టర్ చందూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. అసలు తండేల్ కథ అనుకోకుండా తన మైండ్ లోకి వచ్చిందని, అప్పుడే ఆ కథలో తనకు ఓ స్పార్క్ కనిపించిందని తెలిపాడు. తనకొచ్చిన ఐడియాను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన భార్య మరియు సినిమాటోగ్రఫర్ కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) తనకు చాలా సాయం చేశారని చందూ మొండేటి తెలిపాడు.
తండేల్ ట్రైలర్ చూసి అందరూ ఇదొక దేశభక్తి సినిమా అనుకుంటున్నారని, కానీ తండేల్ ఒక గొప్ప లవ్ స్టోరీ అని తెలిపాడు. అంతేకాదు తండేల్ లో దేశభక్తి, పాకిస్తాన్ కు సంబంధించిన అంశాలు 20 నిమిషాలు మాత్రమే ఉంటాయని, మిగిలినదంతా లవ్ స్టోరీనే అని, ఇంత గొప్ప లవ్ స్టోరీ రాస్తానని తానెప్పుడూ అనుకోలేదని చందూ ఈ సందర్భంగా చెప్పాడు.













