అక్టోబర్ 9th వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతున్న చకోర – Lunar Love Bird’ మూవీ Censored U/A
High Joy Commercials బ్యానర్ పై డా. చింతాడ హేమారావు నిర్మాతగా, VIP – Vintage Iconic Pictures నిర్మాణ సారథ్యంలో మంగా శ్రీనివాస్ రచన- దర్శకత్వంలో రూపొందిన మాస్ పోయెట్రీ మ్యూజికల్ లవ్ స్టోరీ చకోర – Lunar Bird .
ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు చిత్ర నిర్మాత మరియు దర్శకుల్ని అభినందించారు. సెన్సార్ కత్తెరకు పని చెప్పకుండా యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను అతి తక్కువ నిడివి 2.17.58 సెకండ్స్ తో ఆద్యంతం ప్రేక్షకులని సీట్ లో నుంచి కదలకుండా కట్టిపడేసే స్క్రీన్ ప్లే తో చిత్రాన్ని రక్తి కట్టించారని చిత్ర యూనిట్ ని ప్రశంసించారు.
శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా చకోర – Lunar Love Bird’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది. చకోర ఆడియో హక్కులు TSeries Music దక్కించుకుంది.








