న్యూయార్క్ లో సరికొత్త డ్యాన్స్ తో మూవ్స్ నేర్చుకొంటున్న కేథరిన్
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరస సినిమాల్లో నటిస్తూ తనంటూ ప్రత్యేకమైన గుర్తింపు, స్టైల్ సాధించుకున్న నటీమణీ కేథరిన్ థెరిసా. ఈ అందాల భామ ఇటీవల నేనే రాజు నేనే మంత్రితో నటిగా మంచి విజయంతోపాటు పేరు కూడా సంపాదించుకుంది. త్వరలో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీ మేకర్స్ రవితేజ హీరోగా రూపొందించనున్న చిత్రంలో కథానాయికగా నటించే క్రేజీ ఆఫర్ను సొంతం చేసుకొంది. ప్రస్తుతం ఓ రెండు వారాల పాటు న్యూయార్క్లో హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేయడం కోసం అమెరికా వెళ్లిన కేథరిన్ అక్కడ మిస్ వీ అను వరల్డ్ పాపులర్ డ్యాన్సర్ దగ్గర క్రాష్కోర్స్ జాయిన్ అయింది. ఆల్రేడీ మంచి డ్యాన్సర్ అయిన కేథరిన్ తన కొత్త గుర్తింపు మిస్ వి దగ్గర పాపింగ్ అండ్ లాకింగ్ స్టైల్లో ట్రైనింగ్ తీసుకోనుంది. ఆల్రెడీ ట్రైనింగ్ మొదలైంది. ఈ సరికొత్త డ్యాన్స్ మూవ్స్ కేవలం తన డ్యాన్సింగ్ స్కిల్స్ పెంపొందించుకోవడం కోసం తన సరికొత్త సినిమాలో ప్రేక్షకులను ఆలరించడం కోసమేనని కేథరిన్ పేర్కొంది.













