AA22xA6: సీజీ, పోస్ట్ ప్రొడక్షన్ ను బట్టే రిలీజ్ డేట్

పుష్ప2(pushpa2) తర్వాత అల్లు అర్జున్(Allu Arjun), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(trivikram) తో సినిమా చేస్తాడని అందరూ అనుకుంటే అందరికీ షాకిస్తూ అట్లీ కుమార్(Atlee Kumar) తో సినిమాను అనౌన్స్ చేశాడు. బన్నీ, అట్లీ కాంబోలో సినిమా వస్తుందని అనౌన్స్‌మెంట్ రాగానే దీనిపై భారీ హైప్ ఏర్పడింది. రోజురోజుకీ ఈ సినిమాపై అంచనాలు పెరుగుతుండగా, ఈ సినిమాను సన్ పిక్చర్స్(sun pictures) పాన్ వరల్డ్ మూవీగా నిర్మిస్తోంది.
AA22xA6 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీలో బన్నీ(bunny) విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. అట్లీ, బన్నీని ఎలాంటి లుక్స్ లో చూపిస్తాడో చూడ్డానికి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పునర్జన్మ, టైమ్ ట్రావెల్ లాంటి సైంటిఫిక్, ఫాంటసీ అంశాలను జోడించి అట్లీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
అయితే ఈ సినిమా గురించి తాజా అల్లు అర్జున్ ఫ్రెండ్, టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు(bunny vasu) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అల్లు అర్జున్, అట్లీ సినిమాకు సీజీ వర్క్ చాలా కీలకమని, సీజీ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పైనే చిత్ర రిలీజ్ డేట్ ఆధారపడి ఉందని, సిట్యుయేషన్స్ చూస్తుంటే సినిమా 2026 లేదా 2027 లో రిలీజయ్యే ఛాన్సుందని బన్నీ వాసు చెప్పుకొచ్చాడు.