Bunny- Koratala: బన్నీతో కొరటాల స్టోరీ డిస్కషన్స్?
రీసెంట్ గా పుష్ప2(Pushpa2) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్(Allu Arjun) తన తర్వాతి సినిమాను త్రివిక్రమ్(Trivikram) తో చేయనున్నాడనే విషయం తెలిసిందే. అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా నిర్మాత నాగవంశీ(Naga Vamsi) ఎప్పటికప్పుడు ఆ ప్రాజెక్టు గురించి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాడు. స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తైందని, బన్నీ ఫ్రీ అవగానే సినిమా స్టార్టవుతుందని తెలిపాడు.
ఇదిలా ఉంటే ఇప్పుడు బన్నీ(Bunny)తో మాస్ డైరెక్టర్ కొరటాల శివ(KOratala Siva) స్టోరీ డిస్కషన్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల దేవర(Devara)తో మంచి హిట్ అందుకున్న కొరటాల ప్రస్తుతం ఆ సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు బన్నీతో మూవీ సడెన్ గా తెరపైకి వచ్చింది. అయితే ఈ కాంబినేషన్ ఇప్పటిది కాదన్న విషయం తెలిసిందే.
కొన్నేళ్ల కిందటే బన్నీ, కొరటాల కలిసి సినిమా చేయాలనుకుని ఓ కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. కానీ ఎందుకో కానీ ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తర్వాత బన్నీ పుష్ప సిరీస్ చేయడం, కొరటాల దేవర చేశారు. ఇప్పుడు మళ్లీ బన్నీ కోసం కొరటాల ఓ కొత్త కథను రెడీ చేసి వినిపించాడని తెలుస్తోంది. అయితే కొరటాల కథ బన్నీకి నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా వారిద్దరి కాంబోలో సినిమా రావడానికి చాలా టైమ్ పట్టనుంది. బన్నీ కోసం ఇప్పటికే త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) లైన్ లో ఉన్నారు. ఆ సినిమాలు పూర్తవడానికి ఎంత లేదన్నా మూడేళ్లకు పైగా పడుతుంది. మరోవైపు కొరటాల కూడా దేవర2(Devara2) పూర్తి చేయాలి. కాబట్టి వీరి కాంబోలో సినిమా వచ్చినా దాని కోసం చాలా కాలం వేచి చూడాలి.













