గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి బంపరాఫర్
మల్టీ టాలెంటెడ్ హీరో విశ్వక్సేన్ కెరీర్ లో ముందుకు దూసుకెళ్తున్నాడు. రీసెంట్ గా గామి సినిమాతో ఎవరూ చేయడానికి సాహసించని రోల్ ను ఎంచుకుని ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు విశ్వక్. తన నటనతో సినీ విమర్శకులను సైతం అబ్బురపరిచిన విశ్వక్సేన్ ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో సందడి చేయనున్నాడు.
ఛల్ మోహన్ రంగ డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఆడియన్స్ లో మంచి బజ్ ఉంది. మే 17న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కానుంది. గోదావరి బ్యాక్ డ్రాప్ లో విలేజ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో విశ్వక్ కోనసీమ కుర్రాడిగా కనిపించనున్నాడు.
ఈ సినిమాకు టిల్లు స్వ్కేర్ హిట్ బాగా కలిసొస్తుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, టిల్లు స్వ్కేర్ నిర్మాణ సంస్థలు రెండూ ఒకటే కావడంతో అది ఈ సినిమా బిజినెస్ కు ప్లస్ కానుంది. ఈ బ్యానర్ నుంచి కొన్నాళ్ల కిందట వచ్చిన ఆదికేశవ డిజాస్టర్ కావడంతో నాగవంశీ స్టోరీ సెలెక్షన్ ఎందుకు మిస్ అయిందనుకున్నారంతా. ఇప్పుడు టిల్లు స్వ్కేర్ మూవీతో సితార సంస్థ మంచి లాభాలను అందుకుంటోంది. ఫస్ట్ షో నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఇప్పుడు నాగవంశీపై అందరికీ మంచి నమ్మకమేర్పడింది. బాక్సాఫీస్ వద్ద క్లిక్ అయ్యే చిత్రాలనే సెలెక్ట్ చేసుకుంటాడని మరోసారి ప్రూవ్ చేశాడంటున్నారు.













