Peddi: నాదీ హామీ అంటున్న బుచ్చిబాబు

ఆర్ఆర్ఆర్(RRR) సినిమాతో మంచి హిట్ ను మాత్రమే కాకుండా గ్లోబల్ లెవెల్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం పెద్ది(Peddi) అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు సాన(Buchi babu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ మూవీలో జాన్వీ కపూర్(Jahnvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్నారు.
విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కోసం మేకర్స్ త్వరలోనే భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తుండగా ఆ షెడ్యూల్ లో చరణ్ పై యాక్షన్ సీన్స్ ను షూట్ చేయనున్నారని సమాచారం. ఇదిలా ఉంటే పెద్ది సినిమాలో చరణ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడని, ఆ సెకండ్ రోల్ కు సంబంధించిన షూటింగ్ ను కూడా ఇదే షెడ్యూల్ లో చేయనున్నారని సమాచారం.
అయితే గతంలో చరణ్ పలుసార్లు డ్యూయెల్ రోల్ లో నటించారు. అంతేకాదు, రీసెంట్ గా శంకర్(Shankar? దర్శకత్వంలో వచ్చిన గేమ్ ఛేంజర్(Gane Charan) లో కూడా చరణ్ రెండు పాత్రల్లో నటించగా, గేమ్ ఛేంజర్ డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పుడు మరోసారి చరణ్ డ్యూయెల్ రోల్ చేస్తుండటంతో ఎలాంటి ఫలితమొస్తుందోనని ఫ్యాన్స్ భయపడుతున్నారు. కానీ పెద్ది విషయంలో సక్సెస్ గ్యారెంటీ.. నాదీ హామీ అంటున్నారు బుచ్చిబాబు. చూడాలి మరి పెద్దితో చరణ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో.