Mokshagna: మొదలవకుండానే వాయిదా ఏంటి మోక్షు?
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) వారసుడు నందమూరి మోక్షజ్ఞ(Nandamuri Mokshagna) కోసం ఎదురు చూపులు ఫలించాయని ఫ్యాన్స్ ఆనందపడే లోపే సడెన్ గా ఓ పిడుగు లాంటి వార్త వచ్చింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ప్రశాంత్ వర్మ(Prasanth Varma) దర్శకత్వంలో రూపొందనున్న మోక్షజ్ఞ డెబ్యూ మూవీ నిన్న లాంచ్ కావాల్సింది. కానీ వాయిదా వేస్తున్నట్లు మీడియాకు ప్రెస్ నోట్ పంపారు.
అయితే అందులో వాయిదాకు కారణాలు మాత్రం ఎవరూ తెలపలేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం మోక్షజ్ఞ ఇంకాస్త టైమ్ అడుగుతున్నాడని తెలుస్తోంది. మరి మోక్షు తన ఎంట్రీని కొంచెం లేట్ చేయాలనుకుంటున్నాడా లేక అసలు వద్దనుకుంటున్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఇది ఇప్పట్లో తేలేది కాదనిపిస్తుంది.
ఎంట్రీకి అంతా రెడీ అయి, ఫోటో షూట్ కూడా అయిపోయాక మోక్షజ్ఞ సడెన్ గా ఇలాంటి డెసిషన్ తీసుకోవడం వెనుక కారణమేంటన్నది తెలియాల్సి ఉంది. కొంతమంది ఆరోగ్య కారణాల వల్ల వాయిదా పడిందంటున్నారు కానీ అసలు రీజనేంటన్నది బాలయ్య(Balayya) ఓపెన్ అయితే తప్ప తెలీదు. ఇప్పటికే మోక్షు ఎంట్రీ బాగా లేటయిన నేపథ్యంలో వీలైనంత త్వరగా తన తెరంగేట్రం జరిగితే బెటర్.













