బాలయ్య పక్కన చేయడానికి హీరోయిన్స్ తప్పించుకుంటున్నారెందుకూ?
నందమూరి బాలకృష్ణ బోయపాటి హ్యాట్రిక్ మూవీ కి హీరోయిన్ లు కరువయ్యారు. మంచి హీరోయిన్ ని సెలెక్ట్ చేద్దామని ఫ్యాన్స్ ని ఖుషీ చేద్దామనుకుంటే చిత్ర యూనిట్ కి హీరోయిన్ దొరక్క సతమతమౌతున్నారు. బాలయ్య పక్కన హీరోయిన్ కోసం సెర్చింగ్ అలా సాగుతూనే ఉంది. ఈ మూవీలో ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ పేర్లు అనుకున్నా ఈ మధ్య మళయాళ హీరోయిన్ ప్రయాగ మార్టిన్ అని ఫిక్స్ అయ్యారు ఆ అమ్మడు ఎందుకో చివరి నిముషంలో మిస్ కొట్టింది. దానికి ఆమె డేట్స్ అడ్జస్ట్ కాలేదని చెబుతున్నా ఆమె బాలయ్య పక్కన చిన్న పిల్లలా కనిపిస్తోందని వద్దనుకున్నారుట. ఇక అఖిల్ ఫస్ట్ మూవీ లో నటించిన సయ్యేషాను ఎంపిక చేశామని అధికారిక న్యూస్ వచ్చినా అయితే ఆమె కూడా ఇపుడు నో చెప్పిందని అంటున్నారు. అసలు కారణం చేప్పకుండా… మా అమ్మకు బాగోలేదు ఆమె ఆరోగ్యం కుదుట పడ్డాక డేట్స్ ఇస్తాను అని తప్పించుకుంది. ఇక చేసేది లేక ఈ మూవీ విషయంలో మరో కొత్త పేరుని ఇపుడు లైన్ లో పెట్టారు. ఆమె ఎవరో కాదు కంచె హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ఈ అమ్మడు పేరు ముందు అనుకున్నా మధ్యలో మిస్ అయింది. చివరికి అందరినీ కాదనుకుని మళ్ళీ ఇక్కడికే వచ్చారని టాక్.
వచ్చే వారం నుంచి బాలయ్య షూటింగ్ కి రెడీ అవుతున్నారు. మరి అప్పటికైనా ప్రగ్యా జైస్వాల్ అయినా లిస్ట్ లో ఉంటుందా లేదా అనే అనుమానం. ఆమెతో ఈ మూవీ హీరోయిన్ల సెర్చింగ్ కి ఫుల్ స్టాప్ పడుతుందా అన్నది చూడాల్సిందే. ఇక ఈ మూవీకి సంబంధించి చూస్తే ఇద్దరు బాలయ్యలు ఉంటారు. ఇప్పటికే ఒక బాలయ్యకు హీరోయిన్ పూర్ణను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి సమ్మర్ కి ఈ మూవీని రెడీ చేస్తారని అంటున్నారు. హీరోయిన్స్ విషయం లో ఎందుకో బాలయ్య అంటే భయపడేలా ఎవరో వెనకవుండి సినిమా నడిపిస్తున్నారని తెలుస్తోంది. లేకపోతే బాలకృష్ణ వంటి టాప్ స్టార్ తో చేయడానికి అభ్యంతరం ఎందుకూ?













