బన్నీ కోసం బోయపాటి రెండేళ్లు ఆగాల్సిందేనా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun), డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati srinu) కాంబినేషన్లో మరో భారీ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన సరైనోడు(Sarainodu) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా బోయపాటి ఓ పౌరాణిక నేపథ్యంతో కూడిన కథను బన్నీ(Bunny)కి వినిపించారని, అందుకు ఆయన పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారని సమాచారం. గీతా ఆర్ట్స్(Geetha arts) ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు మాత్రం చాలా టైమ్ పట్టే అవకాశముంది.
ఇవి కూడా చదవండి
ప్రస్తుతం అట్లీ(Atlee) దర్శకత్వంలో అల్లు అర్జున్ రాకా(Raaka) సినిమాలో నటిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ 2027 ఫస్టాఫ్ లో పూర్తయ్యే అవకాశముంది. తర్వాత లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. మరోవైపు బాసిల్ జోసెఫ్(Basil joseph) దర్శకత్వంలోనూ గీతా ఆర్ట్స్ నిర్మాణంలో భారీ ప్రాజెక్ట్ కోసం డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాలన్నీ పూర్తి కావడానికి కనీసం రెండేళ్లు పట్టొచ్చని అంచనా.
ఇక అఖండ2(Akhanda2) రిలీజై ఏడాది గడుస్తున్న నేపథ్యంలో బోయపాటి నెక్ట్స్ మూవీపై ఆసక్తి నెలకొంది. అల్లు అర్జున్ కోసం రెండేళ్ల పాటు ఎదురుచూస్తారా? లేక ఈలోగా మరో హీరోతో సినిమా పూర్తి చేస్తారా? అనేది ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. పౌరాణిక కథతో బన్నీని బోయపాటి ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లోనూ కనిపిస్తోంది. అయితే ఈ కాంబినేషన్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.







