వృషకర్మపై భారీ అంచనాలు.. అందరి చూపు ట్రైలర్‌పైనే!
అక్కినేని నాగచైతన్య(Akkineni Naga chaitanya) కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా వృషకర్మ(Vrushakarma). మిస్టిక్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్, సాంగ్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభించడంతో డిసెంబర్లో ఆడియన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో వృషకర్మ ఒకటిగా నిలిచింది. సినిమాపై ఉన్న నమ్మకంతో నాగచైతన్య ఈ ప్రాజెక్టు కోసం చాలా ఎక్కువ టైమ్ ను కేటాయించారు. రిలీజ్ కు ముందే నెల రోజుల పాటు వివిధ ప్లాట్ఫార్మ్ ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ప్రస్తుతం అందరి దృష్టి ఈ సినిమా ట్రైలర్‌పైనే ఉంది. ఓ గుహ నేపథ్యంలో సాగే కథ అనేక ప్రాంతాలకు విస్తరిస్తుందని, ఊహించని మలుపులతో ఆడియన్స్ ను ఆశ్చర్యపరుస్తుందని నాగచైతన్య వెల్లడించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. విరూపాక్ష(Virupaksha)తో డైరెక్టర్ గా తనదైన ముద్ర వేసిన కార్తీక్ దండు(Karthik dandu) తెరకెక్కిస్తున్న రెండో సినిమా కావడంతో కథ, కథనాలపై ప్రత్యేక అంచనాలు నెలకొన్నాయి.
ప్రముఖ టెక్నికల్ టీమ్ వర్క్ చేసిన ఈ సినిమాను నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందించారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ అన్నీ పూర్తైనట్టు తెలుస్తోంది. రిలీజ్ కు ముందే నెలకొన్న సానుకూల వాతావరణం చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకొస్తున్న వృషకర్మ నాగచైతన్య కెరీర్లో ఎలాంటి మైలురాయిగా నిలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది.







