శర్వానంద్‌కు కలిసొచ్చిన వాయిదాలు!
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద శర్వానంద్(sharwanand)కు అనుకోని అవకాశం లభించింది. సంపత్ నంది దర్శకత్వంలో ఆయన నటించిన భోగి(Bhogi) ఈ నెల 27న ఆడియన్స్ ముందుకు రానుంది. వాస్తవానికి నవంబర్ 12న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడింది. తాజాగా సెన్సార్ ప్రక్రియ పూర్తిచేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. అయితే, అదే రోజున రిలీజ్ కావాల్సిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda sai sreenivas) హైందవ(Haindhava), రష్మిక మందన్న(Rashmika mandanna) మైసా(Mysaa) సినిమాలు పోస్ట్‌పోన్ కావడంతో భోగికి పోటీ లేకుండా పోయింది.
ప్రస్తుతం ప్రతి వారం పలు సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్న నేపథ్యంలో సోలో రిలీజ్ దక్కడం శర్వానంద్‌కు కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఎక్కువ థియేటర్లు అందుబాటులోకి రావడంతో పాటు ఓపెనింగ్స్ పరంగానూ ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. శర్వానంద్ కెరీర్లో ఛాలెంజ్ తో కూడుకున్న పాత్రగా ఇది నిలవనుంది. మాస్ ప్రేక్షకులను టార్గెట్ గా చేసుకుని సంపత్ నంది ఈ సినిమాను రూపొందించారు.
ఇవి కూడా చదవండి
అయితే, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం భోగికి కీలకం కానుంది. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో పలు క్రేజీ సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. దీంతో మొదటి వారంలోనే వీలైనంత ఎక్కువ కలెక్షన్లు రాబట్టాల్సిన పరిస్థితి నెలకొంది. కేకే రాధామోహన్(KK Radhamohan) నిర్మించిన ఈ సినిమాకు పాజిటివ్ మౌత్‌టాక్ లభిస్తే బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకునే అవకాశముంది. సోలో రిలీజ్ అవకాశాన్ని శర్వానంద్ ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.







