సెన్సార్ కొత్త నిబంధనలు.. టాలీవుడ్లో రిలీజుల టెన్షన్!
సినిమాల సెన్సార్ విషయంలో కేంద్ర చలనచిత్ర ధ్రువీకరణ మండలి (సీబీఎఫ్సీ) కఠినంగా వ్యవహరిస్తోంది. సెన్సార్‌కు అప్లై చేసుకునే టైమ్ లో సినిమా ఫుల్ లెంగ్త్ ఫైనల్ కాపీని సబ్మిట్ చేయాలని స్పష్టం చేసింది. సెన్సార్ బోర్డు ఆమోదించిన వెర్షన్‌ను మాత్రమే థియేటర్లలో ప్రదర్శించాలని సూచించింది. రిలీజ్ కు లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ముందుగానే సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని నిర్మాతలకు సూచించింది. దీంతో టాలీవుడ్లో పలువురు దర్శక, నిర్మాతలు అప్రమత్తమవుతున్నారు.
ఇప్పటికే నవంబర్‌లో రిలీజ్ కావాల్సిన పలు సినిమాలపై సెన్సార్ ప్రభావం కనిపిస్తోంది. శర్వానంద్(Sharwanand) నటించిన భోగి(Bhogi) సెన్సార్ సమస్యల కారణంగా రెండు వారాలు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రష్మిక మందన్న(rashmika mandanna) మైసా(MYsaa) సెన్సార్ ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో రిలీజ్ పోస్ట్‌పోన్ అయింది. మరోవైపు బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda sreenivas) నటించిన హైందవ(Haindava) సినిమాను హడావుడిగా రిలీజ్ చేయకుండా 2027 ఫిబ్రవరికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
డిసెంబర్లో రిలీజ్ కు రెడీ అవుతున్న పలు సినిమాలు ఇంకా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ దశల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రిలీజ్ డేట్స్ ను అనౌన్స్ చేసిన కొన్ని సినిమాలు వాయిదా పడే అవకాశముందనే డిస్కషన్ ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది. సెన్సార్ పరిశీలనలో అభ్యంతరాలు ఎదురైతే రివిజన్ కమిటీకి వెళ్లాల్సి రావడం మరింత ఆలస్యానికి దారితీస్తోంది. దీంతో రిలీజ్ డేట్స్ కు అనుగుణంగా ప్రొడక్షన్ వర్క్స్ ను ముందుగానే పూర్తి చేయడం నిర్మాతలకు కీలకంగా మారింది.







