బొంబాట్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన పూరి
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో సుచేత డ్రీమ్ వర్క్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈనగరానికి ఏమైంది ఫేమ్ సుశాంత్ హీరోగా, సిమ్రాన్, చాందిని హీరోయిన్స్‌గా.. రాఘవేంద్ర వర్మ (బుజ్జి) దర్శకత్వంలో విశ్వాస్ హనూర్కర్ నిర్మిస్తున్న చిత్రం బొంబాట్. ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ లోగోను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ యంగ్ బ్లడ్ కలిసి చేసిన బొంబాట్ ఫస్ట్ లుక్‌ను ఇప్పుడే చూశాను. చాలా బావుంది. సుశాంత్, సిమ్రాన్, చాందిని, మకరంద్ దేశ్ పాండే కీలక పాత్రల్లో నటించారు. జోశ్యభట్ల నాకు మంచి స్నేహితుడు జోష్ తను మ్యూజిక్ డైరెక్టర్‌గా సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఈ సినిమా కలెక్షన్స్‌తో బొంబాట్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.













