Dragon: ఎన్టీఆర్ కు తల్లిగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) హీరోగా మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prasanth Neel) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్లలోకి వస్తుందా అని ఆడియన్స్ కూడా ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.
డ్రాగన్(Dragon)(వర్కింగ్ టైటిల్) అనే ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ నటిస్తుందని అంటున్నారు. ఆమె మరెవరో కాదు. కాజోల్(Kajol). ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాల్లో ఎన్టీఆర్ కు తల్లి పాత్రలో కాజోల్ కనిపిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంతన్నది పక్కన పెడితే ఒకవేళ ఇదే నిజమైతే ఈ సినిమాకు ఇది పెద్ద స్పెషల్ ఎట్రాక్షన్ కావడం ఖాయం.
ఇదిలా ఉంటే డ్రాగన్ మూవీని తారక్(Tarak) కెరీర్లోనే బెస్ట్ గా నిలపాలని ప్రశాంత్ నీల్ ఎంతో కష్టపడుతున్నాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా ఎప్పుడూ లేనిది ఈ సినిమా కోసం ఎంతో స్లిమ్ గా తయారై కనిపిస్తున్నాడు. చిత్ర యూనిట్ సభ్యులైతే ఇప్పటివరకు నీల్ తీసిన సినిమాలన్నింటిలోకెల్లా ఇదే అతని బెస్ట్ వర్క్ అవుతుందని ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. మరి చూడాలి డ్రాగన్ కోసం ప్రశాంత్ ఏం ప్లాన్ చేశాడో.






