డబుల్ ఇస్మార్ట్ లో బాలీవుడ్ బ్యూటీలు?
లైగర్ సినిమా ఇచ్చిన రిజల్ట్ తో కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన పూరీ, రీసెంట్ గా తన తర్వాతి సినిమాకు పూజా కార్యక్రమాలు నిర్వహించాడు. రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు పూరీ. పూరీ కనెక్ట్స్ బ్యానర్ లో ఛార్మీ ఈ సినిమాను నిర్మిస్తుంది.
తనకు ఇస్మార్ట్ శంకర్ లాంటి మంచి హిట్ ఇవ్వడంతో రామ్ కూడా పూరీతో సినిమా చేయడానికి వెంటనే ఓకే అనేశాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్స్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇస్మార్ట్ శంకర్ లోని హీరోయిన్లు నిధి అగర్వాల్, నభానటేష్ లనే తీసుకుంటే ఈ సినిమాకు కూడా బాగుంటుందనేది ఫ్యాన్స్ మాట.
ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ కు వారి గ్లామర్ డోస్ చాలా ప్లస్ అయింది. ఈ సినిమాలో కూడా వారినే తీసుకుంటే ఆ సెంటిమెంట్ ను కూడా కంటిన్యూ చేయొచ్చనేది వారి వెర్షన్. కానీ పూరీ మాత్రం డబుల్ ఇస్మార్ట్ లో హీరోయిన్లుగా శ్రద్దా కపూర్, సారా అలీఖాన్ లను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న ఈ ఇద్దరూ అయితే డబుల్ ఇస్మార్ట్ సినిమాకు పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ వస్తుందనేది పూరీ వెర్షన్. కాకపోతే వీరిద్దరినీ భరించే బడ్జెట్ ఛార్మీ పెడుతుందా అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. అసలే లైగర్ సినిమాతో ఉన్నదంతా పోగొట్టుకున్న ఛార్మీ మరి ఈ సినిమాకు బడ్జెట్ ఆలోచించి పెడుతుందా లేదా బడ్జెట్ విషయంలో మరే ఆలోచన లేకుండా పూరీ మీద నమ్మకంతో ముందుకెళ్తుందా అనేది చూడాలి.













