లక్ష్మీ పార్వతిగా రూపాలీ సూరి?
రూపాలీ సూరి ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు అసలు తెలియదు. ఆ మాటకు వస్తే హిందీ ప్రేక్షకులకు కూడా. కాకపోతే ఆమెజాన్లో త్వరలో విడుదల కానున్న ఇన్సైడ్ ఎడ్జ్-2 వెబ్‌సీరిస్‌లో కనిపించనున్నారు. అలాగే తెలుగులో లక్ష్మీస్ ఎన్టీఆర్ లోనూ. నందమూరి తారక రామారావు, లక్ష్మీ పార్వతి అనుబంధం నేపథ్యంలో రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఇందులో లక్ష్మీ పార్వతిగా రూపాలీ సూరి కనిపిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సినిమా గురించి రూపాలి సూరి మాట్లాడుతూ అవును లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో నేను నటిస్తున్నా. అందరిలో త్వరలో వివరాలు తెలుస్తాయి. ఇప్పటికి నేను చెప్పగలిగేది ఒక్కటే. ఈ సినిమాలో భాగం అవుతున్నందుకు చాలా ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను. ఇదొక అద్భుతమైన కథ. చాలా పెద్ద సినిమా అన్నారు.













