బ్లాక్ పాంథర్ చాడ్విక్ బోస్మాన్ ఇక లేరు
బ్లాక్ పాంథర్‌గా నటించి పలువురి ప్రశంసలు దక్కించుకున్న హాలీవుడ్ స్టార్ నటుడు చాడ్విక్ బోస్మాన్ (43) మరణించారు. 2016 నుంచి ఆయన పెద్దపేగు కేన్సర్‌తో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 2016లో వచ్చిన కెప్టెన్ అమెరికా సివిల్‌వార్ సినిమాలో మార్వెల్ సూపర్ హీరో బ్లాక్ పాంథర్ పాత్రను పోషించిన చాడ్విక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఇదే పాత్రను ఎవెంజర్స్ ది ఎండ్‌గేమ్ లోనూ పోషించాడు. 2018లో వచ్చిన బ్లాక్ పాంథర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్ల డాలర్లకు పైగా వసూలు చేసింది. 2016 నుంచి కేన్సర్‌కు చికిత్స పొందుతూనే పలు సినిమాల్లో చాడ్విక్ నటించారు. ఈ ఏడాది ప్రారంభంలో నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైన డా 5 బ్లడ్స్ లో చాడ్విక్ చివరిసారిగా కనిపించారు.













