బ్లాక్ బోర్డ్ ట్రైలర్ విడుదల
సాయికృష్ణ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం బ్లాక్ బోర్డ్. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇంతకు ముందు ఎందరో మహానుభావులు నిర్మించిన తల్లాడ శ్రీనివాస్ ఈ చిత్రానికి నిర్మాత. తల్లాడ సాయికృష్ణ దర్శకత్వం వహిస్తూ నటించిన చిత్రమిది. సినిమా ట్రైలర్‌ను యువ హీరో ప్రిన్స్ విడుదల చేసి, సాయి కృష్ణ ద్విపాత్రాభినయం చేయడం ఆస్కతిగా ఉందని అన్నారు. అతిథిగా పాల్గొన్న తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ హీరో సాయికృష్ణలో ఉన్న తపనని తెలుసుకుని ప్రోత్సహించిన ఆయన తండ్రి అభినందనీయుడు అని అన్నారు. నిర్మాణ తల్లాడ శ్రీనివాస్ మాట్లాడుతూ సినిమాను అనుకున్న టైమ్‌లో పూర్తిచేయడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి అని తెలిపారు. హీరో, దర్శకుడు సాయి కృష్ణ మాట్లాడుతూ ఇది సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. ఖమ్మం జిల్లా లో చిత్రీకరణజరిపాం అని చెప్పారు. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో హీరోయిన్ మాధురిచిగురు, సయ్యద్, రాధాకృష్ణ పులవర్తి, సాగర్ శైలేష్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విఆర్ఏ.ప్రదీప్, ఛాయాగ్రహణం: శివ.













