AA22: ఇంట్రో సీన్స్ కోసం భారీ సెట్

పుష్ప2(pushpa2) తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేస్తాడా అని అందరూ అనుకుంటున్న టైమ్ లో స్టార్ డైరెక్టర్ అట్లీ(atlee) తో సినిమాను అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu Arjun). భారీ బడ్జెట్ తో చాలా కొత్త కాన్సెప్ట్ తో అట్లీ ఈ సినిమాను భారీ రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు. జవాన్(jawaan) తర్వాత అట్లీ నుంచి వస్తున్న మూవీ కావడంతో దీనిపై అందరికీ మంచి అంచనాలున్నాయి.
ఆల్రెడీ సెట్స్ పై ఉన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ముంబై లోని మెహబూబా స్టూడియోస్ లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్ లో అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సీన్స్ కు సంబంధించిన సీన్స్ ను షూట్ చేస్తున్నారని, ఈ సినిమాలో బన్నీ విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడని, అందులో ఓ క్యారెక్టర్ మరీ యంగ్ గా ఉంటుందని అంటున్నారు.
ఈ ఇంట్రో సీన్స్ ను గ్రీన్ మ్యాట్ లో షూట్ చేస్తున్నట్టు సమాచారం. సమాంతర ప్రపంచం, పునర్జన్మల కాన్సెప్ట్ తో సై-ఫై మూవీగా అట్లీ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా హాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థ ఈ సినిమా కోసం రంగంలోకి దిగింది. దీపికా పదుకొణె(deepika padukone) హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని సన్ పిక్చర్స్(sun pictures) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే.