Allu Arjun Arrest: బన్నీ అరెస్ట్ కేసులో కొత్త డౌట్లు రేకెత్తిన లెటర్లు
సంధ్య థియేటర్లో(Sandhya Theatre) జరిగిన దుర్ఘటన, అల్లు అర్జున్(Allu Arjun) అరెస్ట్ చుట్టూ తలెత్తిన వివాదం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. పుష్ప2(Pushpa2) స్పెషల్ షో సందర్భంగా ఏర్పడిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం అందరినీ షాక్ కు గురి చేసింది. ఈ ఘటనలో బన్నీ(Bunny) అరెస్ట్ కావడంతో రెండు డౌట్స్ తలెత్తుతున్నాయి.
అల్లు అర్జున్ నిరపరాధి అని కొందరంటుంటే, మరికొందరు చట్టానికి ఎవరైనా ఒకటే అంటున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రెండు లెటర్లు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరుతూ రాసిన లెటర్. రెండోది పోలీసుల నుంచి ఆ అభ్యర్థనను తిరస్కరిస్తూ వచ్చిన లెటర్.
థియేటర్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన లెటర్ అఫీషియల్ లెటర్‌హెడ్ మీద ఉంటే, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినట్లు చెప్తున్న లెటర్ మాత్రం చేత్తో రాసిన లెటర్ లా ఉండటం గమనార్హం. ఆ లెటర్ అఫీషియల్ లెటర్‌హెడ్ పై రాలేదు. పైగా పేజీని బాగా గమనిస్తే అది స్టేపుల్స్ కు సంబంధించిన కాగితంపై రాసినట్లు అర్థమవుతుంది. దీంతో ఈ లెటర్ నిజమా కాదా అనే కన్ఫ్యూజన్ కలుగుతుంది. ఆ లెటర్ లో హీరో, హీరోయిన్, ప్రొడక్షన్ యూనిట్ థియేటర్ కు రావొద్దని చాలా క్లియర్ గా రాసి ఉంది. కాకపోతే అది అధికారిక లెటరా కాదా అన్నది మాత్రం ఈ కేసులో కీలక పాత్ర పోషించనుందని అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ రెండు లెటర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.













