భోళా శంకర్ తగ్గేదేలే..
వాల్తేరు వీరయ్య సినిమాతో ఫుల్ జోష్ మీదున్న చిరంజీవి, ఆ సక్సెస్ ఇచ్చిన సంతోషంలో ఇప్పుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ అయిన పోస్టర్లు ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుండటంతో ఈ సినిమాతో చిరూ ఖాతాలో మరో హిట్ ఖాయమని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
రీసెంట్గా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ బయటకు వినిపిస్తోంది. భోళా శంకర్ సినిమా షూటింగ్ క్లైమాక్స్ కు చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట మేకర్స్. హైదరాబాద్లో ఓ స్పెషల్ సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు, ఈ షూటింగ్ ఎక్కువ భాగం రాత్రి పూటనే షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
దీనికోసం మెగాస్టార్ నైట్ అవుట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో కీర్తి సురేష్, సుశాంత్, మురళీ శర్మ, రవి శంకర్ కూడా షూటింగ్లో పాల్గొంటున్నారు. సినిమాకు సంబంధించి ఇదే ఆఖరి షెడ్యూల్ అని తెలుస్తోంది. ఆగస్టు 11న రిలీజ్ కానున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దీంతో పాటే సమాంతరంగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది.













