పవన్‌కల్యాణ్ బర్త్ డే సందర్భంగా భీమ్లా నాయక్ తొలి గీతం
పవన్‌కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్లో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం భామ్లా నాయక్. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు. రచయిత త్రివిక్రమ్ అందిస్తుండగా, నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె.చంద్ర. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా భీమ్లా నాయక్ తొలి గీతాన్ని ఈ రోజు విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు కిష్ ఈ గీతాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ సాంగ్ ఊహించిన దానికి కంప్లీట్ డిఫరెంట్‌గా ఉంది. పూర్తి భిన్నమైన ట్యూన్‌తో కన్పిస్తోంది. భీమా పుట్టుక నుంచి పోలీస్‌గా ఉండే వ్యక్తిత్వం వరకు అందించిన రామ జోగయ్యశాస్త్రి చాలా కొత్తగా అన్పించింది. థమన్ సంగీతం ప్లస్ అయింది. సాంగ్ డిజైన్, విజులవ్ అన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి.













