Bhartha Mahasayulaki Vignapthi: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి సెకండ్ సింగిల్ డిసెంబర్ 10న రిలీజ్
మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaki Vignapthi) తో అలరించబోతున్నారు. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఇందులో రవితేజ సరసన ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు.
బ్లాక్ బస్టర్ ఫస్ట్ సింగిల్ బెల్లాబెల్లాతో మ్యూజిక్ ప్రమోషన్లను స్టార్ చేసిన మేకర్స్ ఇప్పుడు సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచారు. సెకండ్ సింగిల్ అద్దం ముందు డిసెంబర్ 10న రిలీజ్ కానుంది.
రవితేజ, డింపుల్ హయతిపై చిత్రీకరించిన ఈ సాంగ్ అదిరిపోయే మెలోడీ డ్యూయెట్. మేకర్స్ రిలీజ్ చేసిన ప్రేమోలో రవితేజ, డింపుల్ హయతి కెమిస్ట్రీ చూడముచ్చటగా వుంది. ఫుల్ సాంగ్ పై అంచనాలు పెంచింది.
ఈ సినిమాకి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ ప్రసాద్ మురెళ్ల, జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్, ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్.
భర్త మహాశయులకు విజ్ఞప్తి 2026 సంక్రాంతికి విడుదల కానుంది.






