ఈ నెల 30న భైరవగీత
ధనుంజయ్ ఇర్రా మోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం భైరవగీత. సిద్థార్థ తాతోలు దర్శకత్వంలో సంచలన దర్శకుడు వర్మ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు వివరాలు తెలియజేస్తూ రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన భైరవగీత చిత్రం ఈ నెల 30న విడుదల చేస్తున్నాం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉంటాయి. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా, భాస్కర్ రాశి నిర్మిస్తున్నారు.













