భాగ్యశ్రీ జీవితాన్ని మార్చేసిన బచ్చన్
ఎన్నో అంచనాలతో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా రిలీజ్ కు ముందు హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే ఎంత హాట్ టాపిక్ అయిందో అందరికీ తెలిసిందే. మిస్టర్ బచ్చన్ రిలీజ్ తర్వాత భాగ్యశ్రీకి కూడా రష్మిక, పూజా, శ్రీలీల లానే వరుస అవకాశాలొస్తాయని అందరూ భావించారు. కానీ సినిమా డిజాస్టర్ అవడంతో ఆ ఎఫెక్ట్ తన ఛాన్సుల మీద పడేట్లు కనిపిస్తుంది.
భాగ్యశ్రీని సెలెక్ట్ చేయాలనుకున్న పలువురు దర్శకనిర్మాతలు మిస్టర్ బచ్చన్ తర్వాత మళ్లీ ఆలోచనలో పడ్డట్టు సమాచారం. ప్రస్తుతం భాగ్యశ్రీ రానా నిర్మాతగా దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. కానీ ఆ సినిమా ఇంకా రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లలేదు. విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్ననూరి సినిమాలో కూడా అమ్మడు నటిస్తుందని తన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యముంటుందని ఇన్ సైడ్ టాక్.
అయితే భాగ్యశ్రీ అందం పరంగా మంచి మార్కులేయించుకున్నప్పటికీ నటన పరంగా మాత్రం అమ్మడికి పెద్దగా మార్కులు పడలేదు. పైగా సొంత డబ్బింగ్ మొదటికే మోసాన్ని తెచ్చింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మిస్టర్ బచ్చన్ వల్ల అందరికంటే ఎక్కువగా నష్టపోయింది భాగ్యశ్రీనే. మిస్టర్ బచ్చన్ హిట్ అయుంటే ఇప్పటికే అమ్మడికి వరుస ఆఫర్లు వచ్చేవి కానీ ఫలితం తేడా కొట్టడంతో భాగ్యశ్రీ ఆశలన్నీ నిరాశే అయ్యాయి. ఎలాగూ టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఉంది కాబట్టి దాన్ని సరిగా వాడుకుని వచ్చిన అవకాశాల్ని అందుకుంటూ హిట్ కొడితే మంచి ఫ్యూచర్ ఉండే ఛాన్సుంటుంది. కాకపోతే దానికి టైమ్ పడుతుంది.













