క్రేజీ ఆఫర్ పట్టేసిన భాగ్య శ్రీ
రవితేజ(Ravi Teja) హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్(Mr. Bachan) రిలీజ్ కు ముందు ఎక్కువగా హైలైట్ అయింది అందులో హీరోయిన్ గా నటించిన భాగ్య శ్రీ బోర్సే(Bhagya Sri Borse)నే. సినిమాలో అమ్మడిని చూపించిన విధానం అందరినీ ఆకర్షించింది. మేకింగ్ దశలో ఉండగానే భాగ్యశ్రీకి వరుస ఆఫర్లొస్తున్నాయని వార్తలొచ్చాయి కానీ రిలీజ్ తర్వాత మాత్రం మొత్తం కథంతా మారిపోయింది.
మిస్టర్ బచ్చన్ సినిమాలో భాగ్య శ్రీ బాగానే హైలైట్ అయినప్పటికీ సినిమా డిజాస్టర్ కావడంతో అమ్మడికి తర్వాత ఆఫర్లేం రాలేదు. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)- గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri) సినిమాలో తప్ప మరే సినిమాలో భాగ్యశ్రీ నటిస్తుంది లేదు. కానీ ఇప్పుడు అమ్మడికి కొంత గ్యాప్ తర్వాత మంచి ఛాన్స్ దక్కింది. రామ్ పోతినేని(Ram Pothineni) హీరోగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty Mr. Polishetty) దర్శకుడు తెరకెక్కించనున్న మహేష్ బాబు(Mahesh Babu) దర్శకత్వంలో భాగ్యశ్రీ హీరోయిన్ గా ఎంపికైంది.
మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) లాంటి ఈ సినిమాను నిర్మించనుంది. మిడ్ రేంజ్ స్టార్లలో మంచి క్రేజ్ ఉన్న రామ్ పక్కన, మైత్రీ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలో నటించే ఛాన్స్ అంటే ఇది కచ్ఛితంగా భాగ్య శ్రీ కి మంచి ఛాన్సే. వరుసగా మాస్ సినిమాలు చేసి ఫ్లాపులు అందుకున్న రామ్, ఈసారి మహేష్ దర్శకత్వంలో క్లాస్ టచ్ ఉన్న వెరైటీ సినిమాను చేస్తున్నాడు.













