ప్రభాస్ తల్లిగా అలనాటి అందాల తార భాగ్యశ్రీ
30 ఏళ్ళ క్రితం ఆమె ఒక పాల బుగ్గల చిన్నది కుర్రకారులంతా అలాంటి అమ్మాయి భార్యాగా వస్తే జీవితం ధన్యం అని కలలు కానివారు. ఏ మాత్రం ఎక్సపోసింగ్ లేకుండా చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని ఆకట్టుకున్న హీరోయిన్ భాగ్యశ్రీ . ఏ మగాడి తల్లి అయినా ఇలాంటికోడలు వస్తే బాగుంటుంది.. ఏ మగాడైనా ఇలాంటి ప్రేయసి, భార్య ఉంటే బాగుంటుంది అనిపించే హోమ్లీ గర్ల్‌గా, మన పక్కింటి అమ్మాయిలా, మనతో కలిసి చదివిన క్లాస్ మేట్‌లా ఆమె రూపం ఉంటుంది. నేటి సాయిపల్లవి, కీర్తిసురేష్లలాగా గ్లామర్ షో చేయకుండా తన చిలిపి నవ్వు, మత్తెక్కించే చూపులు, అద్భుతమైన సౌందర్యం, సల్మాన్ ఖాన్‌తో ఈమె నటించిన మొదటి చిత్రం మైనే ప్యార్ కియా దేశవ్యాప్తంగా సంచలనం. బాలీవుడ్ క్లాసిక్ లవ్ స్టోరీలలో దీనిని ముందు వరుసలో చేర్చవచ్చు.
సల్మాన్ లాంటి నాటి డ్రీమ్ బోయ్ ని కూడా ఈ చిత్రంతో ఆమె డ్రీమ్ గర్ల్ గామారి సల్మాన్ ని డామినేట్ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 1989లో వచ్చిన ఈ చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతాకాదు. దాదాపు అదే చిత్రం మైకంలో, ఆమెనే తల్చుకుంటూ దాదాపు ఆమె పెద్దగా చిత్రాలలో నటించకపోయినా యూత్ అంతా ఆమె కలల్లోనే బతికారు. హిందీ చిత్రంగా విడుదలై తెలుగునాట కూడా ప్రేమ పావురాలు గా సంచలనం సృష్టించింది ఈ మూవీ ఇక ఈమె తెలుగులో రాజశేఖర్, ప్రేమ నటించిన ఓంకారం, బాలకృష్ణ నటించి యువరత్న రానా చిత్రాలలో నటించింది. చాలా కాలం తర్వాత ఇటీవల అడవిశేష్, రాజశేఖర్ పెద్ద కుమార్తె శివానీ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోందని భావించిన టూ స్టేట్స్ చిత్రంలో నటించేందుకు ఒప్పుకుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ చిత్రం ఆగిపోయింది.
తాజాగా ఈమె ప్రభాస్, పూజాహెగ్డే కాంబినేషన్లో జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘రాథేశ్వామ్’ మూవీలో ప్రభాస్ కి తల్లిగా నటించనుందని వార్తలు వచ్చాయి. అయితే చాలా మంది భాగ్యశ్రీ ఈ వయసులో కూడా అదే కోమలత్వంతో టీనేజ్ గర్ల్ గానే ఉందని, సినిమా హీరో అయ్యేంత కొడుకు ఉన్నా ఆమె ప్రభాస్ తల్లిగా కాకుండా అక్కగా అయితేనే బాగుంటుందని వ్యాఖ్యలు చేశారు. అయితే సాహో లాగానే ఈ చిత్రంలో కూడా బాలీవుడ్ కోసం పలువురు బాలీవుడ్ నటులను తీసుకుంటున్నారని, అందుకే ఈ మూవీకి బాలీవుడ్ లో కూడా క్రేజ్ వచ్చేందుకు భాగ్యశ్రీని ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. కాగా ఎట్టకేలకు ప్రభాస్ 20 వ చిత్రంగా రూపొందుతున్న ఈమూవీలో నటిస్తున్నట్లు స్వయంగా భాగ్యశ్రీ క్లారిటీ ఇచ్చింది. ఈ చిత్రంలో ఏ పాత్రను అని చెప్పకుండా ఓ కీలకపాత్రను పోషిస్తున్నట్లు ఆమె వెల్లడించింది. ఐదు పదుల వయసు దాటినా ఇంకా హాట్ గా ఉండే ఈ భామ ప్రభాస్ మూవీకి ఖచ్చితంగా స్పెషల్ అట్రాక్షన్ అవుతుందనే చెప్పాలి. ఈ చిత్రంతో ఈమె టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తూ ఉండటంతో ఆనాటి తరం వారు ఈమెని చాలాకాలం తర్వాత మరలా తెలుగు చిత్రంలో తెరపై చూసేందుకు ఉత్సుకతగా ఉన్నారనే చెప్పాలి.













