భాగ్యశ్రీ హుషారు చూస్తుంటే స్టార్ అవడం ఖాయమనిపిస్తుందే
టాలీవుడ్ లో స్టార్ హీరోలకు తగినంత మంది హీరోయిన్లు లేరు. కొంతమంది హీరోయిన్లు ఇలా వచ్చేసి అలా వెళ్లిపోతే మరికొందరు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే టైమ్ లోనే 10-15 ఏళ్ల కెరీర్ ను ప్లాన్ చేసుకుని దానికి తగ్గట్టే సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఏ హీరోయిన్ కైనా సరే ఫస్ట్ సినిమా మాత్రం సెంటిమెంట్ గా ఉండటం సహజం.
తెలుగులో స్టార్ హీరోయిన్ క్రేజ్ తెచ్చుకుంటే వాళ్లకు పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ వస్తోంది. అందుకే ఈ మధ్య బాలీవుడ్ భామలు కూడా తెలుగు సినిమా అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే భాగ్యశ్రీ బోర్సే, రవితేజ సినిమాలో ఫస్ట్ మూవీ ఛాన్స్ అందుకుంది. వాస్తానికి హరీష్ శంకర్ దృష్టిలో పడినప్పుడే భాగ్యశ్రీ సక్సెస్ అందుకున్నట్లు.
గతంలో పూజాకి లైఫ్ ఇచ్చిన హరీష్ ఇప్పుడు భాగ్యశ్రీకి ఫస్ట్ మూవీతోనే అదిరిపోయే క్రేజ్ దక్కేలా చేశాడు. మిస్టర్ బచ్చన్ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా ఫోకస్ అవుతుంది భాగ్యశ్రీనే. సినిమాలోనే కాదు బయట ప్రమోషన్స్ లో కూడా అమ్మడు ఎంతో యాక్టివ్ గా ఉంటోంది. అమ్మడు హుషారు చూస్తుంటే ప్రస్తుతం ఫామ్ లో ఉన్న హీరోయిన్లను వెనక్కి నెట్టేసేలానే ఉంది. మిస్టర్ బచ్చన్ రిలీజ్ కు ముందే దేవరకొండ విజయ్ తో ఛాన్స్ అందుకున్న భాగ్యశ్రీ, రవితేజ తో కలిసి మొదటి హిట్ కొడితే అమ్మడికి టాలీవుడ్ లో అవకాశాలకు కొదువుండదని చెప్పొచ్చు.













