వాయిదా పడనున్న భగవంత్ కేసరి?
ఈ మధ్య టాలీవుడ్ లో ఏ సినిమా అనుకున్న టైమ్ కు రావడం లేదు. మరీ ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు ఒక రిలీజ్ డేట్ చెప్పడం, తీరా టైమ్ దగ్గరకొచ్చేసరికి వాయిదా వేయడం ఫ్యాషన్ అయిపోయింది. రిలీజ్ కు వారం ముందు కూడా పోస్ట్ పోన్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ బాలయ్య, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న భగవంత్ కేసరి మాత్రం ముందు నుంచి పక్కా ప్లానింగ్ తో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. కానీ ఇప్పుడీ సినిమా కూడా వాయిదా పడే ఛాన్సుందని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది. చంద్రబాబు నాయుడు కేసు విషయంలో బిజీగా ఉన్న బాలయ్య ప్రస్తుతం సినిమాల గురించి ఆలోచించట్లేదని, ఆయనను బయటకు తీసుకొచ్చే పనిలో బాలయ్య నిమగ్నమైనట్లు తెలుస్తూనే ఉంది.
ఇదిలా ఉంటే భగవంత్ కేసరిలో బాలయ్యకు సంబంధించిన షూటింగ్ మరో ఐదు రోజులు పెండింగ్ ఉందట. సినిమా అనుకున్న టైమ్ కు రిలీజ్ కావాలంటే బాలయ్య షూటింగ్ కు హాజరవ్వాలి. కానీ ఇప్పుడా పరిస్థితులు కనిపించట్లేదు. ప్రస్తుతం అనిల్ రావిపూడి బాలయ్య లేకుండా మిగతా ఆర్టిస్టులతో షూటింగ్‌ను పూర్తి చేస్తున్నాడు. సినిమా సినిమానే రాజకీయం రాజకీయమే అని బాలయ్య ఈ సినిమాను పూర్తి చేసి దసరా రేసులో నిలబడతాడా లేక కుటుంబం తర్వాతే ఏదైనా అని బాబు బయటకు వచ్చేవరకు సినిమాల జోలికి వెళ్లడా అనేది తెలియాల్సి ఉంది. భగవంత్ కేసరి రిలీజ్ విషయంలో ఫ్యాన్స్ ఇప్పుడు కంగారు పడుతున్నారు.













